మూవీలలో నటించడానికి దానితో సంబంధం లేదు... శృతి హాసన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మొదలు పెట్టింది . ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే శృతి  కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచాయి.

అలాంటి సమయం లోనే శృతి  "గబ్బర్ సింగ్" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ... అద్భుతమైన క్రేజ్ ను మరియు అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత శృతి హాసన్ తెలుగులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకొని ఎంతో కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి ... చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీలలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి.

ఈ మూవీ లతో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీలో శృతి  హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి  సినీ ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో నటించడానికి వయసుతో ఏ మాత్రం సంబంధం లేదు అని ... అది ఒక సంఖ్య మాత్రమే అని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా నటీనటుల వయసు గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటారు అని ... కాకపోతే ... ఏ వయసులో ఉండవలసిన అందం ఆ వయసులో ఉంటుంది అని శృతి  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: