ఆన్ స్టాపబుల్ 2 : లేటెస్ట్ ఎపిసోడ్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ... బాహుబలి ది కంక్లూషన్ మూవీ లతో దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. దానితో ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలలో మరియు అంతకు మించిన మూవీలలో నటిస్తూ తన కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ ... ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకొని సలార్ ... ప్రాజెక్ట్ కే ... మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ లో నటించబోతున్నాడు. ఇలా వరుస కమిట్మెంట్ లతో ... వరుస మూవీ షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ఒక ఎపిసోడ్ కు గెస్ట్ గా విచ్చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
 

కొన్ని రోజుల క్రితమే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. మొదటగా ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆహా యూనిట్ ప్రకటించింది. కానీ అంతకు ఒక రోజు ముందుగానే ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 29 వ తేదీన ఆహా యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన కేవలం 12 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు ఆహా యూనిట్ తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: