పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు యూఎస్ లో భారీ షాక్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక మూవీలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు. అలాగే సముద్ర కని దర్శకత్వంలో కూడా మరో మూవీ లో నటించబోతున్నాడు.

ఈ మూవీ లతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో ఖుషి మూవీ కూడా ఒకటి. ఖుషి మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కు గొప్ప గుర్తింపును తీసుకువచ్చింది. ఎస్ జే సూర్య ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... భూమిక ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మణిశర్మ ఈ మూవీ కి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని డిసెంబర్ 31 వ తేదీన మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులకు యుఎస్ లో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఖుషి మూవీ రిలీజ్ వేల యుఎస్ మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులు ఈ మూవీ కి థియేటర్ లను ఇవ్వలేము అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పలు అగ్ర హీరోల సినిమాలను మల్టీప్లెక్స్ థియేటర్ లలో రీ రిలీజ్ చేయడం వల్ల నష్టాలే మిగిలినట్లు ... దానితో ఖుషి రీ రిలీజ్ కి థియేటర్ లను ఇవ్వలేము అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: