వాల్తేరు వీరయ్య' నుంచి మరో సాంగ్ రిలీజ్..పునాకాలే ఫ్యాన్స్ కు..

Satvika
గాడ్ ఫాదర్ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా తర్వాత కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా మరో సినిమాను లైన్లో పెట్టారు చిరంజీవి..బాబీ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య' ..ఈ సినిమా షూటింగ్ పనులను ఇటీవలే పూర్తీ చేసింది.. మరి కొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా వుంది.. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెటింగ్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా అంచనాలను పెంచుతున్నాయి..

ఈ సినిమా లో రవితేజ కూడా ప్రధాన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.. మాస్ జాతర చేయడాని కి సిద్దమవుతున్నాడు. ఈ మూవీలో రవితేజ ఒక పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించనున్నాడు.. గతంలో వీరిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు.. ఆ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. చాలా కాలం తర్వాత మల్లీ వీళ్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు దేవి సంగీతాన్ని అందిస్తున్నారు..

గతంలో ఈ మూవీ నుంచి 'బాస్ పార్టీ', 'చిరంజీవి శ్రీదేవి', 'వీరయ్య' సాంగ్స్ రిలీజ్ కాగా.. మూవీ లోని హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడాని కి యూనిట్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాట లో చిరంజీవి, రవితేజ కలిసి డాన్స్ చేయబోతున్నారు.. న్యూ ఇయర్ కానుకగా శుక్రవారం డిసెంబర్ 30న ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చిరు, రవితేజ ల డాన్స్ ఫోజ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు పక్కా.. మరీ ఈ సాంగ్ రేపు విడుదల అయ్యి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: