ప్రేమ కథ చిత్రం హీరోయిన్ నందిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Divya
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ప్రేమ కథ సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటించారు. ఈ సినిమా హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందిత హీరోయిన్ గా నటించింది .ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో డైరెక్టర్ హీరోకు హీరోయిన్ కు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నందిత తన అందంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈమె నటించిన మొదటి చిత్రం నీకు నాకు డ్యాష్ డ్యాష్. అయితే ఈ సినిమాతో పాపులర్ కాకపోయినా ఈమె ప్రేమ కథ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించింది.
తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ ప్రేమ కథ చిత్రంతో మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత మలయాళంలో లండన్ బ్రిడ్జ్ అనే సినిమాలో నటించింది నందిత ఆ తర్వాత మరే సినిమాలలో కూడా నటించలేదు. కేవలం సుదీర్ బాబుతో కలిసి మూడు సినిమాలలో నటించింది. చివరిగా నందిత నటించిన విశ్వమిత్ర సినిమా  2019లో విడుదల అయింది. అలాగే ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే అప్పటికే కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి అభిమానులు తెగ ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే నందిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.నందిత ఇప్పుడు మరింత అందంగా మారిపోయి చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రస్తుతం నందిత వయసు 28 సంవత్సరాలు.. ఆకట్టుకునే అందం ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం రాలేకపోవడంతో సినిమాలలో నటించలేదు అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పలు భాషలలో అడపాదడపా సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. మరి అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాలలో నటిస్తుందేమో చూడాలి మరి నందిత. ప్రస్తుతం ఆమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: