ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 తెలుగు డబ్బింగ్ మూవీలు ఇవే..?

Pulgam Srinivas
ఇప్పటివరకు ఎన్నో ఇతర భాష సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ... విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా ఇతర భాషల నుండి తెలుగులో విడుదల అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను తెలుగులో రాబట్టిన టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా  శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 84.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి టాప్ 1 స్థానంలో నిలిచింది.
రోబో 2.0 : దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
రోబో : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
కాంతారా : కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ మూవీ లో  హీరోగా నటించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 29.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.
ఐ : టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తేరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 28.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. చియాన్ విక్రమ్ ఈ మూవీ లో హీరోగా నటించిన అమీ జాక్సన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: