వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో కొన్ని తెలుగు సినిమాలు మరియు కొన్ని డబ్బింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.


రావణాసుర : మాస్ మహారాజా రవితేజ హీరో గా సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రావణాసుర మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.


భోళా శంకర్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది ...


జైలర్ : సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు.


రుద్రుడు : రాఘవ లారెన్స్ హీరో గా కతిరేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

పోన్నియన్ సెల్వన్ 2 : గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... కార్తీ ... జయం రవి ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు.


ఈ సినిమాలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్నాయి. ఈ మూవీ లలో కొన్ని మూవీ లపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: