అదిరిపోయే పాయింట్ తో కార్తికేయ 3.. ఈసారి 3డిలో సినిమా..!

shami
యువ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2014లో కార్తికేయ సినిమాతో హిట్ అందుకోగా అదే చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ 2 అంటూ తీసి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అందుకున్నారు. కార్తికేయ 2 చివర్లోనే కార్తికేయ 3కి సంబంధించిన క్లూస్ కొన్ని వదిలారు. ఇక దీనిపై లేటెస్ట్ గా స్పందించారు నిఖిల్. లేటెస్ట్ గా 18 పేజెస్ అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్ ఆ సినిమా మౌత్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్నాడు నిఖిల్. ఇక ఒక అభిమాని కార్తికేయ 3 గురించి చెప్పమని అడిగితే.. కార్తికేయ 3 కోసం ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందని.. చందు మొండేటి దాని పని మీద ఉన్నాడని చెప్పారు. అంతేకాదు కార్తికేయ 3 సినిమా త్రీడీలో తీస్తామని చెప్పాడు నిఖిల్. కార్తికేయ 3 అప్డేట్ తో ఆ సినిమా ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యారు. 18 పేజెస్ సినిమా రిలీజ్ కు ముందే లాభాలు తెచ్చి పెట్టింది. అయితే థియేట్రికల్ రన్ లో కూడా సినిమా సక్సెస్ అనిపించుకుంది.
18 పేజెస్ తర్వాత నిఖిల్ వెంటనే కార్తికేయ 3 చేస్తాడా లేక గ్యాప్ లో మరో సినిమా పూర్తి చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. యువ హీరోల్లో డిఫరెంట్ కథలతో సత్తా చాటుతూ వస్తున్న నిఖిల్ కి కార్తికేయ 2 వల్ల పాన్ ఇండియా క్రేజ్ దక్కింది. ఆ సినిమా చూశాక నిఖిల్ అంతకుముందు సినిమాలను కూడా హిందీ ఆడియన్స్ చూడటం మొదలు పెట్టారు. మొత్తానికి నిఖిల్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. నిఖిల్ కార్తికేయ 3 మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నిఖిల్ చేస్తున్న ఈ సినిమాల వల్ల అతని కెరీర్ గ్రాఫ్ పైకి పెరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో నిఖిల్ ఇంకెన్నో అద్భుతాలు చేస్తాడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: