రష్మీ అలా చేసి డబ్బులు సంపాదిస్తోంది.. రాకింగ్ రాకేష్ సెన్సేషనల్ కామెంట్స్..??

Anilkumar
బుల్లితెర యాంకర్లలో టాప్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ రష్మి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్కడ కొన్ని పాత్రలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆమెకి గుర్తింపు దక్కలేదు. దాని అనంతరం జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈమె. ఆ షో లో భాగంగానే సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత గుర్తింపును పొందింది. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలలో నటించింది రష్మి. కొన్ని హారర్ సినిమాలలో సైతం నటించింది ఈమె. 

అప్పట్లో ఈమె నటించిన గుంటూరు టాకీస్ సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దాని అనంతరం చాలా హారర్ సినిమాలలో నటించింది. అయినప్పటికీ ఏ సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేకపోయింది.తాజాగా నందు హీరోగా వచ్చిన ఒక సినిమాలో రష్మి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేకపోయింది. సినిమా మంచి విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ రష్మీ  ఏ మాత్రం వెనకడుగు వేయకుండా యాంకరింగ్ ను కొనసాగిస్తూ ఉంది.అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ఒక ప్రోమో ఇటీవల విడుదలైంది.

అందులో భాగంగా కమెడియన్ రాకింగ్ రాకేష్ రష్మీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఆయన స్కిట్లో భాగంగా జాతకాలు చెప్పే వాడిలాగా దొంగ స్వామీజీ గెటప్ లో ఉంటాడు రాకింగ్ రాకేష్. ఇక ఇందులో భాగంగా రష్మీ గురించి మాట్లాడుతూ అందరూ డబ్బులు లేకపోతే గుండెలు బాధ కొంటారు కానీ రష్మీ మాత్రం గున్న గున్న మామిడి అనే డాన్స్ స్టెప్ తో గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది అంటూ రష్మి పై షాకింగ్ కామెంట్లను చేయడం జరిగింది. దీంతో రాకింగ్ రాకేష్ రష్మీ ఇలా డబ్బులు సంపాదించుకుంటుంది అనడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: