"యూఎస్ఏ" లో ఆ రేర్ మార్క్ ను టచ్ చేసిన "18 పేజెస్" మూవీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఈ సంవత్సరం చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా నిఖిల్ నార్త్ ఇండియా ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ కి కుమారి 21ఎఫ్ మూవీ తో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా ... అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచవ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ముఖ్యంగా "యూ ఎస్ ఏ"  లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ కి ఆ ప్రాంతంలో అద్భుతమైన కలెక్షన్ లు కూడా వస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటివరకు ఓవర్సీస్ లో 250 కే కలెక్షన్ లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే ఇప్పటికి కూడా "యూ ఎస్ ఏ" లో ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లభిస్తున్నాయి. ఫైనల్ గా 18 పేజెస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: