పవన్... మహేష్ ఆ క్రేజీ పోటీలో గెలిచేది ఎవరు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టార్ డమ్ ఉన్న హీరోలు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా ఇప్పటికే తమ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో లుగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే వీరిద్దరి కెరీర్ లో ఖుషి మరియు ఒక్కడు మూవీ లు బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం మన అందరికీ తెలిసిందే. ఖుషి మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరగగా ... ఒక్కడు మూవీ ద్వారా మహేష్ బాబు క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. ఇలా వీరిద్దరి కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ లుగా నిలిచిన ఈ రెండు మూవీ లు కూడా కేవలం ఒక వారం గ్యాప్ లో మళ్ళీ రీ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఖుషి మూవీ ని డిసెంబర్ 31 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించగా ... ఒక్కడు మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 7 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

ఈ రెండు మూవీ ల రీ రిలీజ్ కోసం ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఆ అభిమానుల కోరిక నెరవేరబోతుంది. మరి రిలీజ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషి మూవీ ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేస్తుందా ... మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన ఒక్కడు మూవీ ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేస్తుందా అనేది ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆసక్తిగా మారింది. మరి ఈ క్రేజీ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: