పొన్నియన్ సెల్వన్ -2 నుంచి లేటెస్ట్ అప్డేట్..!

Divya
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ -1 ఇటీవల సెప్టెంబర్ నెలలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను బాగా అలరించింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. హీరో కార్తీక్, జయం రవి, విక్రమ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
డిసెంబర్ 30వ తేదీన ఈ పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ విడుదల అయింది. అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండవ పార్ట్ కూడా ఏప్రిల్ 28 2023న థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ వారం లోపల విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి భాగంతో ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం రెండవ పార్ట్ తో భారీ స్థాయిలో విజయాన్ని అందివ్వాలని ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , జయరాం, శరత్ కుమార్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత, ధూళిపాల, విక్రమ్ ప్రభు లాంటి భారీ తారాగణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి పోస్టర్లు ఈవారం విడుదల చేయబోతున్నారు అని సమాచారం. ఏది ఏమైనా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: