యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌..

Satvika
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..బ్యాక్ టూ బ్యాక్ సినిమాల తో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.. అలాగే రీమెక్ సినిమాలను ఎక్కువ చేస్తూ వస్తున్నారు... ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో 'వాల్తేరు వీరయ్య సినిమా లో నటిస్తున్నారు మరోసారి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. ఊరమాస్ లుక్ లో చిరు కనిపిస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇక మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది...

ఇది ఇలా ఉండగా..ఇటీవల డిసెంబర్ 26న విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 7 మిలియన్ కు పై వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టింది. ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ టైటిల్ ట్రాక్ అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ పై మెగా అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

 షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 27న నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు చిరంజీవి..తనను బాబీ ఉహించని విధంగా చూపించాడని.. ఈ సినిమా కోసం అందరూ ప్రేమను పంచారని అన్నారు..క్లాస్ , మాస్ ప్రేక్షకులకు మంచి ఊపు నిచ్చె విధంగా దేవి పాటలను చిత్రీకరించారు..మొత్తానికి విడుదల అయిన అన్ని పాటలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: