యాంకరింగ్ కు సుమ గుడ్ బై.. ఎందుకో తెలుసా?

Satvika
యాంకర్ సుమ.. ఈ పేరుకు మంచి క్రేజ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే.. కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు తెలుగు నెర్చుకొని ఇప్పుడు తెలుగు వాళ్ళు గర్వించే స్థాయికి చేరుకుంది.. అంతేకాదు యాంకరింగ్ గురూ అయ్యిందన్న విషయం తెలిసిందే.. తెలుగు యాంకర్స్ లో మొదటగా వినిపించే పేరు ఈమెదే  కావడం విశేషం..ఈమె మాటలు, పంచులు చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటుంది.. సుమ వేస్తున్న పంచులకు ,ప్రశ్నలకు ఎంత పెద్ద సెలెబ్రేటీ అయిన కూడా నోరు మూసుకుంటున్నారు.

ఇకపోతే స్టార్ హీరోలు సైతం తమ ఆడియో ఫంక్షన్లకి,ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఇంటర్వ్యూ లకు సుమ ఉండాలని అంటున్నారు.సుమ ఇప్పటివరకు చేసిన అన్నీ సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. అలాంటి క్రేజ్ ఉంది సుమకు.. అయితే  ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పై పొద్దున్న నుంచి కొన్ని రుమెర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో నిజముందా లేదా అన్నది పక్కన పెడితే దీనిపై వార్తాలు మాత్రం ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి..

ఈటీవీలో ప్రసారం అయిన స్టార్ మహిళ ప్రోగ్రామ్ ద్వారా గ్రుహినులకు బాగా దగ్గరైంది. సుమ షాకింగ్ న్యూస్ తన అభిమానులకు చెప్పింది. న్యూ ఇయర్ రాబోతున్న సందర్భంగా ఈటీవీ వాళ్ళు వేర్ ఈజ్ ద పార్టీ అనే ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రోగ్రాం లో యాంకర్ సుమని సన్మానించారు.. ఆ సందర్భంగా ఆమె బాగా ఎమోషనల్ అయ్యింది..కెరీర్ మొదలు పెట్టినప్పటికి నుంచి ఇప్పటివరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను తలుచుకుని కంటతడి పెట్టుకుంది.. ఈ మేరకు కొన్ని రోజుల విరామం ఇవ్వాలనుకుంటుందా లేక మొత్తంగా యాంకరింగ్ కి గుడ్ బై చెబుతుందా అని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..అసలు సుమా ఎం చెబుతుందా అని ఎదురుచూస్తున్నారు.. ఎమౌతుందొ చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: