మట్టి కుస్తీ ఓటీటీ విడుదల వాయిదా.. ఏమైందంటే..?

Divya
డిసెంబర్ రెండవ తేదీన తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన చిత్రం మట్టికుస్తీ. తమిళంలో గట్టకుస్తీ పేరిట విడుదలైన ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటించారు. ఆర్ టీ టీం వర్క్స్ విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా విడుదల కాబోతోంది. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రవితేజ నిర్మాతగా భాగం పంచుకున్నారు. ఇకపోతే విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణ, శ్రీజ రవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 20 తేదీన విడుదల చేయగా.. డిసెంబర్ 2వ తేదీన సినిమాలు విడుదల చేసి భారీ విషయాన్నీ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన తర్వాత భారీ క్రియేట్ చేస్తుంటే ఓటీటీ విడుదల వాయిదా వేస్తూ వస్తుంటారు.  ఈ క్రమంలోనే మొత్తం 172 థియేటర్లలో విడుదలైన మట్టి కుస్తీ సినిమా ఇప్పటికీ కూడా మంచి ప్రజాదారణతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓటీటీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. డిసెంబర్ 29వ తేదీన మట్టి కుస్తీ సినిమా ఓటీటీ రిలీజ్ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం థియేటర్లలో ఇంకా రన్ అవుతుందో నేపథ్యంలో ఓటిటి విడుదలను వాయిదా వేశారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి థియేటర్లలో ఇంకా విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేస్తారు అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికైతే విష్ణు విశాల్ పై రవితేజ పెట్టిన పెట్టుబడి భారీ స్థాయిలో వసూలు అవుతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరోలను నమ్మి ఇన్వెస్ట్ చేసిన రవితేజ పై గతంలో విమర్శలు వచ్చినా ఆయన నమ్మకం ఒమ్ముకాలేదని మరొకసారి నిరూపించారు.  దీంతో రవితేజ లాభాల బాట పట్టినట్టే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: