అవతార్2: ఇండియన్ బాక్స్ వద్ద సెన్సేషన్?

Purushottham Vinay
సరిగ్గా రోజుల క్రితం విడుదలైన అవతార్-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్ల జోరు అసలు ఏమాత్రం తగ్గలేదు.ఒక్కో రికార్డు బద్దలు కొడుతూ వందల కోట్ల కలెక్షన్లని సాధిస్తూ... హౌస్ ఫుల్ బోర్డులతో ఈ సినిమా వేగంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మాయాజాలంతో కలెక్షన్లపరంగా ఈ సినిమా ఇప్పటిదాకా టాప్ 5లో నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.7000 కోట్ల వసూళ్లతో టాప్-5 లో నిలిచింది.ఇక త్వరలోనే అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్లను కూడా అవతార్-2 చాలా ఈజీగా అధిగమించేస్తుందని ఓ అంచనా.ఇక ఇండియాలో వచ్చిన వసూళ్ళని గమనిస్తే..ఇప్పటికే 300కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది.


ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా 60 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది.ఇంకా ఇండియాలో ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో బాక్సాఫీస్ వద్ద ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తోంది.అలాగే అవతార్ మిగిలిన భాగాలు కూడా వివిధ దశల్లో ఉన్నట్టు ఇటివలే జేమ్స్ కామెరూన్ తెలిపారు. 2009 వ సంవత్సరంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ తీయాలని చాలామంది భావించారు. చాలా సంవత్సరాలు కష్టపడి.. ఈ సినిమాని తీశాడు జేమ్స్ కామెరూన్. అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహం ఇంకా అవతార్-2లో సముద్రం చూపించి ప్రేక్షకుల్ని ఎంతగానో మంత్రముగ్దుల్ని చేశారు జేమ్స్ కామెరూన్.మొత్తానికి సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఇంకా ముందుకు ఈ సినిమా దూసుకుపోతుంది.ఇక చూడాలి ఫ్యూచర్ లో ఈ సినిమా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో..అవతార్ పార్ట్ 1 30 వేల కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతవరకు ఆ రికార్డుని ఏ సినిమా బద్ధలు కొట్టలేదు.మరి ఆ రికార్డుని ఈ సినిమా బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: