"నేనే వస్తున్నా" మూవీకి ఫస్ట్ టైం వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఎంతంటే..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ధనుష్ "నేనే వస్తున్నా" అనే మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ధనుష్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు భాషలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను ఈ మూవీ ఏ మాత్రం అందుకో లేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది.

ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ సంస్థ ఈ సినిమాను జెమినీ టీవీలో ప్రసారం చేయగా . . మొదటి సారి ఈ మూవీ కి బుల్లి తెరపై 3.03 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఒక డబ్బింగ్ సినిమా మరియు అందులోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఈ రేంజ్ లో "టి ఆర్ పి" ని తెచ్చుకోవడం కాస్త బెటర్ విషయం అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం తిరు మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ధనుష్ "నేనే వస్తున్నా" మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: