ఫారెన్ లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నా ఆ న్యూ కూపుల్స్..!!

murali krishna
కొద్దిరోజుల క్రితమే  పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్ హన్సికా మోత్వానీ విదేశాల్లో తెగ సందడి చేస్తూ కనిపిస్తోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ తన ఫొటోలను అభిమానులతో ఇలా పంచుకుంటోంది.
తాజాగా ఎయిర్ పోర్టు లో తెగ రచ్చ చేసింది. స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటోంది.
 మన తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అని చెప్పొచ్చు. 'దేశముదురు'తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ చిత్రాల్లో నటించి వెండితెరకు పరిచయం అయ్యింది.
తెలుగు, తమిళం, హిందీలో వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ హీరోల సరసన నటించి అగ్రస్థాయికి చేరుకుంది. అయితే కొద్దికాలంగా హన్సిక కేరీర్ బాగా సాగడం లేదు. దీంతో కొన్నేండ్లు గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ లోనే పెళ్లి పీటలు కూడా ఎక్కింది మరీ
 
ప్రముఖ బిజినెస్ మ్యాన్ సోహైల్ కతూరియా తో హన్సిక పెళ్లి జరిగిన విషయం గురించి మనకు తెలిసిందే. సోహైల్ హన్సికకు స్నేహితుడు.. పైగా వారిద్దరూ కొన్నేండ్లుగా ప్రేమలో మునిగి తేలారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న జైపూర్ లోని చారిత్రక కట్టడం ముండోతా కోటలో ఘనంగా పెళ్లి జరిగింది.
 
హన్సిక పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటాయి మరీ. మెహందీ ఫంక్షన్, హల్దీ ఈవెంట్, వివాహా వేడుక, రిసెప్షన్ గ్రాండ్ గా జరిగిన విషయం  కూడా మనకు తెలిసిందే. ఆ ఫొటోలను రోజు పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తోంది. అలాగే పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్తూ తెగ రచ్చరచ్చ చేస్తోంది ఈ బ్యూటీ.
రీసెంట్ గా పారిస్ లో విపరీతంగా ఎంజాయి చేసింది. ఈఫిల్ టవర్ వద్ద బ్యూటీఫుల్ పోజులతో ఆకట్టుకుంది హన్సిక. తాజాగా ఎయిర్ పోర్టులో కనువిందు చేసింది. స్టైలిష్ వేర్ లో సన్ గ్లాసెస్ పెట్టుకొని.. సూర్యరష్మీ వెలుగులో మరింతగా మెరిసిపోతోంది. స్టన్నింగ్ పోజులతో అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో లో బాగా వైరల్ గా మారాయి.
 
పెళ్లికి ముందు మూడేండ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హన్సిక .. పెళ్లి తర్వాత ఫుల్ బిజీ గా మారింది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కలిపి రెండు చిత్రాలను పూర్తి చేసింది. మరో నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ  బాగా బిజీగా ఉంది. ప్రస్తుతం హన్సిక కేరీర్ స్పీడ్ అందుకుందని.. వింటేజ్ వైబ్స్ తో అలరిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: