తనపై వస్తున్న ఆ వార్తలను ఖండించిన మీనా...!!

murali krishna
మీనా ఇండస్ట్రీలో నలభై ఏళ్ల అనుభవం.ఇన్నేళ్ళలో మీనా మీద ఎలాంటి వివాదం అయితే లేదు. చాలా కూల్ గా ఉంటుంది.మీనా దర్శక నిర్మాతలు మరియు హీరోల ఫేవరెట్ హీరోయిన్.
మంచి వాళ్ళకే కష్టాలు అన్నట్లు మీనా జీవితంలో అతిపెద్ద విషాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆమె భర్త మరణించాడు.. జూన్ 28న మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో చనిపోయారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన విద్యాసాగర్ మీనాను వదిలి వెళ్లిపోయారు.. 46 ఏళ్ల వయసులో మీనా భర్తను కోల్పోయి ఒంటరి అయ్యారు. 2009లో విద్యాసాగర్ ని మీనా ను వివాహం చేసుకున్నారు. ఆయన బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు.
మీనా-విద్యాసాగర్ లకు నైనిక అనే కుమార్తె కూడా ఉన్నారు.పాప వయసు పదేళ్ల లోపే. విద్యాసాగర్ హఠాన్మరణాన్ని మీనా అస్సలు తట్టుకోలేకపోయారు. ఆమె డిప్రెషన్ కి గురయ్యారు. తోటి నటులు కలిసి మీనాను ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. ఇంట్లో ఉంటే అదే వేదన వెంటాడుతుందని మీనా కొద్ది రోజులు టూర్ కి కూడా వెళ్లారు. మానసిక ప్రశాంత పొందే ప్రయత్నం కూడా చేశారు. మీనా మానసికంగా కొంచెం మెరుగయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలో ఆమె మళ్ళీ షూటింగ్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం.. మీనా గతంలో ఒప్పుకున్న చిత్రాల చిత్రీకరణ పూర్తి చేయనున్నారని తెలుస్తుంది.
అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేస్తున్నారట. పనిలో నిమగ్నం కావడం ద్వారా వేధించే ఆలోచనల నుండి బయటపడొచ్చని మీనా కూడా భావిస్తున్నారట. కాగా మోహన్ లాల్ హీరోగా దృశ్యం 3 తెరకెక్కనుందని తెలుస్తుంది.. ఈ చిత్రంలో మీనా నటించనున్నారని సమాచారం. దృశ్యం 1, దృశ్యం 2 సూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు చిత్రాల్లో మీనానే మోహన్ లాల్ భార్య పాత్ర చేశారు. అలాగే ఆ రెండు చిత్రాలు కూడా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయగా దానిలో కూడా మీనానే కొనసాగించారు.
కాగా ఇటీవల మీనా రెండో వివాహం చేసుకోనున్నారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. ఆ వార్తల్లో అస్సలు నిజం లేదని తేలింది. మీనా తండ్రి ఆంధ్ర కాగా తల్లిది కేరళ. 1982లో విడుదలైన తమిళ మూవీ నేన్ జంగల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా వెండితెరకు పరిచయం అయ్యారట.. బాలనటిగా మీనా ఇరవైకి పైగా చిత్రాలను చేశారు. 1990లో విడుదలైన నవయుగం మూవీతో ఆమె హీరోయిన్ గా మారారు. సుదీర్ఘ కెరీర్లో మీనా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కమల్ మరియు రజినీకాంత్ తో పాటు పలువురు సౌత్ ఇండియా స్టార్స్ అందరితో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: