బాలయ్య కోసం పవన్.. గట్టి ప్లానే?

Purushottham Vinay
యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని నందమూరి నటసింహం బాల కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వీరసింహారెడ్డి. ఇక ఈ మూవీ ఈవెంట్ జనవరి నెల 6వ తేదీన ఒంగోలులో చాలా గ్రాండ్ గా జరగనుంది.ఇక ఈ వేడుక జరగడానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉండగా రికార్డ్ స్థాయిలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు వచ్చే గెస్టు గురించి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వార్త ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఏకంగా  పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు అతిధిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.బాల కృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే బాలయ్య పవన్ కాంబినేషన్ లో అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ షూట్ కూడా జరగనుంది.


వచ్చే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరసింహారెడ్డి ఈవెంట్ కు , పవన్ హాజరవుతారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. వీళ్లిద్దరు కూడా కలిసి స్టేజి మీద కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు వుండవు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కి జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక సంక్రాంతి పండుగ కానుకగా రాబోతున్న ఈ సినిమా అభిమానులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.అఖండ తో మంచి ఫాంలో వున్న బాలయ్యకి ఈ సినిమా ఆ రేంజ్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: