ఈ కేరళ ముద్దుగుమ్మకు "2022 సెకండాఫ్" బాగా కలిసొచ్చింది !

VAMSI
మాలీవుడ్ నుండి ఇతర భాషల్లోకి వచ్చి సక్సెస్ అయిన హీరోయిన్ లు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్... ఈమె తెలుగులో మొదటగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన "అ ఆ" సినిమా ద్వారా రెండవ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తన నటన పట్ల ప్రేక్షకులు మరియు దర్శక నిర్మాతలు హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా అనుపమ వరుసగా సినిమాల అవకాశాలను అందుకుంటూ వెళ్ళింది.. ఫలితంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ లో ఒక గ్యారంటీ హీరోయిన్ గా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా 20 సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకుంది.

ఇందులో తనకు బాగా క్రేజ్ తీసుకువచ్చిన సినిమాలలో ప్రేమమ్ , హాలోగురుప్రేమకోసమే , శతమానం భవతి, రాక్షసుడు , ఉన్నది ఒకటే జిందగీ లాంటివి ఉన్నాయి. కాగా రీసెంటుగా చూసుకుంటే కార్తికేయ సీక్వెల్ మూవీ లో నిఖిల్ సిద్దార్థ్ సరసన అనుపమ నటించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతి చోట ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం విశేషం. ఈ సినిమాను చందు మొండేటి చాలా చక్కగా హిందూ ధర్మాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన విధానం పట్ల ప్రేక్షకులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఈ సినిమాతో అనుపమకు వేరే లెవెల్ క్రేజ్ వచ్చింది.

ఇక మూడు రోజుల క్రితం విడుదలైన మరో అందమైన ప్రేమకథ "18  పేజెస్" కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో సక్సెస్ ను అనుపమకు అందించింది. ఇందులో నిఖిల్ హీరో అన్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో అనుపమ నటించిన మరో మూవీ "బటర్ ఫ్లై" ఓ టి టి ద్వారా విడుదల కానుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వచ్చిన రెండు చిత్రాలు అనుపమకు సక్సెస్ ను అందించాయి. ముచ్చటగా మూడవ సినిమా కూడా తనకు హిట్ ను అందించి ఘనంగా నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: