బిగ్ బాస్ నుంచి మరో అప్డేట్ ..నాగ్ అందుకు నో..

Satvika
తెలుగు బిగ్ బాస్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఐదు సీజన్లను పూర్తీ చేసుకుంది..ఇప్పుడు ఆరో సీజన్ ను కూడా పూర్తీ చేసుకుంది..ఇప్పుడు ఈ ఎడో సీజన్ కోసం మళ్ళీ బిగ్ బాస్ యాజమాన్యం రంగం సిద్దం చేస్తున్నారు.ఇక పోతే నాగార్జున, బాలకృష్ణల మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్బాస్ షో కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయట...బిగ్ బాస్ నాలుగు సీజన్లకి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఏడవ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

నాగార్జున ప్లేసులో బాలకృష్ణ హోస్టింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 6 కి టిఆర్పి రేటింగ్ తక్కువగా రావడంతో హోస్ట్ గా బాలయ్యని తీసుకోవాలని బిగ్ బాస్ టీం ఆలోచన చేస్తుందట. ఈ వార్త లో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ ఈ సీజన్ 7 కి బాలయ్య హోస్ట్ అయితే ఈ సెట్ కోసం అన్నపూర్ణ స్టూడియో ఇవ్వను అని నాగార్జున చెప్పినట్లు మరో వార్త బయటకు వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ కూడా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ అంటే రానని బిగ్ బాస్ యాజమాన్యానికి గట్టిగా చెప్పేసాడట.

ఈ విషయం కు ఓకే అయితే హోస్ట్ గా చేయడానికి నాకు ఎటువంటి అభిప్రాయం లేదని ఇటీవల తన కలిసిన ఆ టీం తో బాలయ్య చెప్పినట్లు రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ వార్ వారి వారసులు కూడా కొనసాగిస్తున్నారు...నాగార్జున కనీసం బాలయ్యకి ఆహ్వానం కూడా ఇవ్వలేదని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అయితే మళ్లీ ఒక సినిమా ఈవెంట్లో నాగార్జున బాలకృష్ణ ఎదురుపడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు..కానీ మొహంలో ఎటువంటి నవ్వు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజమేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: