అప్పట్లోనే జ్యోతిష్య శాస్త్రంలో దిట్టగా మారిన ఆ స్టార్ సీనియర్ హీరోయిన్...!!

murali krishna
భానుమతి రామకృష్ణ ఆమె ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులు అయితే ఆమెను అస్సలు మర్చిపోరు.

ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం . 1925 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి గారు జన్మించారు . తండ్రి స్ఫూర్తితోనే సాంప్రదాయ సంగీతాన్ని అలాగే నృత్యాన్ని నేర్చుకుని,అపార సంగీత జ్ఞానాన్ని ఆమె సంపాదించుకుంది. ఆ తర్వాత 1939లో మొదటిసారిగా వరవిక్రయం అనే సినిమాలో నటించి అందరిని కూడా మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన కృష్ణప్రియ అలాగే స్వర్గసీమ ఇలాంటి సినిమాలు ఆమెకు ఎంతగానో గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఆ తర్వాత ఈమె తన కెరీర్ లో తిరిగి వెనుకకు చూసుకోలేదు. భానుమతి రామకృష్ణ గారు కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, దర్శకురాలిగా మరియు నిర్మాతగా, రచయితగా,సంగీత దర్శకురాలిగా అలాగే స్టూడియో యజమానురాగా ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.భానుమతి. అప్పట్లో హీరోలకు సమానంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో చాలా మంది అభిమానులను అయితే సంపాదించుకున్నారు.. అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పే నైజాన్ని ఆమె కలిగి ఉండడంతో ఆమెను చూసి కొందరు ఆమెకు పొగరు అని కూడా అనుకునేవారు. ఆమె మాత్రం అటువంటి పిచ్చి మాటలకు స్పందించేది కాదు..

 భానుమతి గారు 1943 ఆగస్టు 8న తమిళ సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ అయిన పిఎస్ రామకృష్ణారావును పెళ్లి చేసుకున్న తర్వాత భానుమతి రామకృష్ణగా మారి పోయారు.. ఈమెకు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలలో కూడా మంచి పట్టు ఉంది. దాంతో ఆమె ఏది చెప్పినా కూడా కచ్చితంగా అయితే జరిగేది. ఎంజీఆర్ వంటి నటుడికి పరిపాలనయోగం ఉంది అని అతను ముఖ్యమంత్రి కావడానికి 20 ఏళ్ల ముందే ఒక షూటింగ్ విరామం సమయంలో చేతి రేఖలు చూసి చెప్పారట భానుమతి రామకృష్ణ. అదే విషయాన్ని భానుమతి మర్చిపోయిన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంజీఆర్ అదే విషయాన్ని భానుమతికి గుర్తు చేశారని సమాచారం.. ఆ విధంగా అప్పట్లో ఆమె హస్త సాముద్రిక శాస్త్రాలలో కూడా మంచి నైపుణ్యన్ని కలిగి ఉండేది. అంతేకాకుండా ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి అన్నదానికి ఎంజీఆర్ గారే మంచి ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: