గ్యాంగ్ లీడర్ ను కాపీ చేసిన బాబి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాబి , మాస్ మహారాజా రవితేజ హీరోగా హన్సిక హీరోయిన్ గా తెరకెక్కిన పవర్ మూవీతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలుపెట్టి మొదటి మూవీ లోనే యాక్షన్ సన్నివేశాలను ... మాస్ సీన్ లను అద్భుతంగా తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
 

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ ... విక్టరీ వెంకటేష్ ... అక్కినేని నాగ చైతన్య లతో వెంకీ మామ సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాబి ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , బాబీ సింహ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని దర్శకుడు బాబి ... చిరంజీవి కెరియర్ లో అద్భుతమైన సూపర్ హిట్ లుగా నిలిచినటువంటి గ్యాంగ్ లీడర్ ... ముఠామేస్త్రి మూవీల మాదిరిగా తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చిరంజీవి "గ్యాంగ్ లీడర్" మూవీలో మాదిరి స్టీల్ లో ఉన్నాడు  దానితో ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో అద్భుతమైన రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: