ధమాకా రివ్యూ: మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్?

Purushottham Vinay
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా 'ధమాకా'. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించాడు.కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ప్రసన్న కుమార్‌ బెజవాడ ఇచ్చాడు.టీజి ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు. ఈరోజు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమాలో మాస్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తాడు రవితేజ. మాస్ రాజా ఎనర్జీ, కామెడీ టైమింగ్‌ అంటే అందరికి చాలా ఇష్టం. అయితే రవి తేజ రీసెంట్ మూవీలలో  సినిమాలలో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవుతుంది. ఎక్కువగా సీరియస్‌ సబ్జెక్ట్‌నే ఎక్కువగా టచ్‌ చేస్తున్నాడు. పాత రవితేజ మిస్‌ అవుతున్నామనే భావన అభిమానులతో పాటు సాధారణ సీనీ ప్రేమికుల్లో కూడా ఉంది.అయితే ఇప్పుడా లోటు లేదు. ఎందుకంటే 'ధమాకా' సినిమాతో రవితేజ ఆ లోటుని తీర్చాడు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఒకప్పటి రవితేజను చూస్తారు.అయితే ఒక్కటే వెలితి. సినిమా కథ. ఇది మాత్రం రొటీన్‌గా ఉంటుంది.


పాత కథనే అటు ఇటుగా మార్చి దానికి కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ఈ సినిమా రైటర్ ప్రసన్న కుమార్‌కు అలావాటు. 'ధమాకా' సినిమాలో కూడా ప్రసన్న కుమార్‌ అదే ఫాలో అయ్యాడు.అయితే డైరెక్షన్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. ఈ సినిమా రొటీన్‌ కథే అయినప్పటికీ.. కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌ ఇవన్నీ కూడా బాగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాథరావు. మాస్ రాజా  నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొత్తం రవితేజనే వన్ మ్యాన్ షోగా సాగుతుంది. శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు ఈ సినిమాకు చాలా ప్లస్‌ పాయింట్స్.సినిమా ఫస్టాఫ్‌ అంతా కూడా చాలా జాలీగా సాగుతుంది. సినిమా కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీ, పాటలు ప్రేక్షకులను బోర్‌ కొట్టించకుండా అలరిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ చాలా బాగుంటుంది. సెకండాఫ్‌ అంతగా లేదు లేదు. కథ రొటీన్‌గా సాగుతుంది.అయితే లాజిక్స్‌ని వెతక్కుండా మాస్‌ సినిమాను ఎంజాయ్‌ చేసే వాళ్లకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: