"అవతార్ 2" రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
జేమ్స్ కామెరాన్ తాజాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం అవతార్ మూవీ వచ్చి అద్భుతమైన విజయం ప్రపంచవ్యాప్తంగా సాధించడంతో అవతార్ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూశారు. అలా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన అవతార్ 2 మూవీ డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అందులో భాగంగా ఈ మూవీ డిసెంబర్ 16 వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల అయింది.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో , ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు అవతార్ 2 మూవీ 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు 10.85 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు 12.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు 5.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు 4.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు 3.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు 3.20 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 7 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మూవీ 53.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా అవతార్ 2 మూ వీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: