ఆ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న రామ్ చరణ్ అభిమానులు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ అనే మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా , కియరా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి , సునీల్ ఈ మూవీలో ఇతర పాత్రల్లో కనిపించనుండగా  ఎస్ జె సూర్య ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొంతకాలం క్రితమే ఈ మూవీ యూనిట్ న్యూజిలాండ్ లో భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ మరియు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది.

ఈ షెడ్యూల్ తర్వాత ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకొని తాజాగా రాజమండ్రి లో కొత్త షెడ్యూలు ను ప్రారంభించింది. ఈ కొత్త షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు విడుదల అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ సినిమా నుండి కొన్ని షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. మళ్లీ రాజమండ్రి తాజా షెడ్యూల్లో కూడా ఇలా జరగడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఈ మూవీ యూనిట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: