"ఓటిటి" ప్లాట్ ఫామ్ లో ఆ భాషల్లో అందుబాటులోకి వచ్చిన "లవ్ టుడే" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రదీప్  కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా అద్భుతమైన క్రేజ్ ను తమిళ సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు. ఇలా నటుడిగా , దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తమిళ సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకున్న ప్రదీప్ తాజాగా లవ్ టుడే అనే మూవీలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. 

ఈ మూవీ మంచి అంచనాల నడుమ మొదట తమిళ భాషలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ ని తెలుగులో కూడా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ తెలుగులో విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ వర్షన్ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది.

తాజాగా ఈ మూవీ యొక్క తెలుగు , కన్నడ , మలయాళ వెర్షన్ లు కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ మూవీ యొక్క తెలుగు , కన్నడ , మలయాళ "ఓ టి టి" స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈరోజు నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ... ఈ రోజు నుండి ఈ సినిమా తెలుగు , మలయాళ , కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: