ప్రభాస్ విగ్గు వీడియో వైరల్... షాక్ లో డార్లింగ్ ఫాన్స్..!?

Anilkumar
సాధారణంగా సినీ సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా వారు ఎలా ఉంటారు వారు..? వేసుకునే బట్టల ధర ఎలా ఉంటుంది..? వాళ్ళ ఆస్తులు ఏంటి..?అన్న విషయాలపై చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ఈ మధ్య మాత్రం కొంతమంది సినీ సెలబ్రిటీల జుట్టు ఒరిజినలా..? కాదా..?అన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇటీవల సూపర్ స్టార్  మహేష్ బాబు జుట్టు ఒరిజినల్ కాదు అని అనేక రకమైన వార్తలు రావడం జరిగింది. ఇక దాని గురించి మహేష్ బాబు పర్సనల్ మేకప్ మెన్ క్లారిటి ఇచ్చాడు. 

దీంతో అప్పట్లో ఈ వార్తలు కాస్త ఎంత వైరల్ గా మారాయో మనందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు విగ్గు వార్త విన్న అనంతరం చాలామంది హీరోల అభిమానులు వారి హీరోల జుట్టు ఒరిజినలా కాదా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఒక నెటిజన్ ప్రభాస్ జుట్టు ఒరిజినలా లేక విగ్గా అని ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను పెట్టాడు. అందులో భాగంగానే ఆయన.... ఇప్పటివరకు నేను ప్రభాస్ ది నిజమైన జుట్టు అని అనుకున్నాను... కానీ ప్రభాస్ ది విగ్గు అని ఇప్పుడే అర్థమైంది అంటూ ఆ పోస్టును షేర్ చేశాడు. 

అందులో భాగంగానే ఆయన ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోలో ప్రభాస్ జుట్టును ఆయన హెయిర్ స్టైలిస్ట్ సరి చేస్తున్నాడు. దీంతో ఒరిజినల్ జుట్టు అయితే ఎందుకు ఆయన హెయిర్ స్టైల్స్ట్ అంత డెలికేట్ గా పట్టుకొని జుట్టుని సరి చేస్తాడు అంటూ ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరి జుట్టైనా కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఊడిపోతూ ఉండడం సహజం.దానికి గాను హీరోలు తమ సినిమాలో విగ్గులను ధరిస్తూ ఉంటారు. దీనికే వారి అభిమానులు ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని మరికొందరు చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: