నటి జయప్రదకు భారీ షాక్.. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె నటనతో స్టార్ హీరోయిన్గా చలామణి అయిన జయప్రద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని ఏళ్ల క్రితం సీనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన ఈమె అనంతరం తెలుగు తో పాటు  హిందీలో కూడా  సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించింది ఈమె. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రానుంది జయప్రద.అయితే ఈ క్రమంలోనే ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

ఇక అదేంటంటే జయప్రద కి కోర్టు ఒక భారీ షాక్ ఇచ్చింది అని తెలుస్తోంది. ఈమెపై కోర్ట్ నాన్ బెయిలబుల్ వారంట్ ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది.అసలు ఏం జరిగిందంటే  ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ ప్రత్యేక కోర్ట్ ఈమె పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దానికి కారణం జయప్రద ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు కేసుల విచారణకు ఈమె కోర్టుకు హాజరు కాలేదట. దీనికిగాను నాన్ బెయిలబుల్ వారంట్ ను జయప్రదపై కోర్టు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రాంపూర్ న్యాయవాది అమర్నాథ్ మాట్లాడుతూ విచారణ సమయంలో జయప్రద కోర్టుకి హాజరు కాకపోవడంతో ఈమె తీరుపై కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.

ఇందుకు గాను జయప్రదను మంగళవారం విచారణకు కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ సూపర్డెంట్ ను కోర్టు ఆదేశించింది ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 9న వాయిదా వేసింది కోర్ట్. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జయప్రద పై రెండు కేసులు ఉన్నాయి. రాంపూర్ లోని గ్రామీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బహిరంగ సభకు సంబంధించి మొదటి కేసు జయప్రదపై 2019 ఏప్రిల్ 18న నమోదయింది. కుల్దీప్ భట్నాకర్ అనే వీడియో నిఘా బృందం ఇంచార్జ్ ఈ మొదటి కేసును నమోదు చేశారు. ఇక రెండవ కేసు స్వర అనే పోలీస్ స్టేషన్ పరిధిలో నూర్ పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో 19 ఏప్రిల్ 2019 న నమోదయింది. నీరజ్ కుమార్ అనే ఫ్లయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ రెండో కేసును నమోదు చేశారు. అయితే ఈ రెండు కేసులకు సంబంధించి జయప్రద తాజాగా న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. మరి దీనిపై జయప్రద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: