పఠాన్: షారుక్​-దీపిక సెకండ్​ సాంగ్​ అదిరింది?

Purushottham Vinay
బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్ ఇంకా దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న మరో చిత్రం పఠాన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి యూత్ ని ఆకట్టుకోవడమే కాకుండా పలు వివాదాలకు కూడా కారణమైంది. ఇక తాజాగా రెండో పాట కూడా విడుదలైంది. ఫస్ట్ పాటలో లానే రెండో పాటలో కూడా షారుక్-దీపిక హాట్ రొమాన్స్ చేస్తూ కనువిందు చేశారు.ఏకంగా ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో వెండితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై ఆయన అభిమానుల్లో ఒక రేంజిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇటీవలే ప్రమోషన్స్లో భాగంగా సినిమా టీజర్ ని ఇంకా 'బేషరమ్ సాంగ్'ను విడుదల చేశారు. ఈ పాటలో అయితే దీపికా పదుకొణె హాట్‌నెస్, బికినీ ట్రీట్ ఫుల్ కాంట్రవర్సీ అయింది. దీంతో సెకండ్ సాంగ్‌ ఎలా ఉంబోతుందనే ఆసక్తి కూడా షారుఖ్ అభిమానుల్లో ఎక్కువైంది.

ఇక 'ఝూమ్ జో పఠాన్' పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటలో మాత్రం షారుక్ ఇంకా దీపిక తమ అందాల ప్రదర్శనను కాస్త తగ్గించడం జరిగింది. అయితే ఈ సాంగ్ను బ్యూటిఫుల్ గా అదిరిపోయేలా తీశారు. ఈ సాంగ్ ని యూరోపియన్ లొకేషన్లలో షూట్ చేశారు. ఈ పాటలో షారుక్ ఖాన్ రఫ్ లుక్లో  స్టైలిష్గా కనిపించగా దీపిక గ్లామర్గా కనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక ఈ వీడియో విడుదలై కాసేపట్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.ఈ వీడియోకి విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.ఇక బాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన యశ్ రాజ్ ఫిల్మిస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో షారుక్, దీపికతో పాటు జాన్ అబ్రహం కూడా ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది. హిందీ, తమిళం ఇంకా అలాగే తెలుగు భాషల్లో 2023 జనవరి 25 వ తేదీన థియేటర్లలో ఈ సినిమావిడుదల కానుంది. మరి ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: