"ధమాకా" థియేటర్ కౌంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా ధమాకా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ లీల , రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా , బీన్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇప్పటికే బీమ్స్ ఈ మూవీ కి అందించిన సంగీతం అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోంది.

అలాగే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంగీత దర్శకుడు ఈ మూవీ కి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా అందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలకు బీమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమైన రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ యూనిట్ థియేటర్ లను బుక్ చేసుకుంది. మరి ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల అవుతుందో తెలుసుకుందాం.


నైజాం ఏరియాలో ఈ సినిమా 228 థియేటర్ లలో విడుదల కాబోతోంది. సీడెడ్ లో ఈ సినిమా 160 థియేటర్ లలో ... ఆంధ్రా లో ఈ సినిమా 280 థియేటర్ లలో ... మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 670 థియేటర్ లలో విడుదల కాబోతోంది. అలాగే కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో 70 థియేటర్ లలో ... ఓవర్సీస్ లో 200 థియేటర్ లలో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 940 కంటే ఎక్కువ థియేటర్ లలో ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: