"ధమాకా" యుఎస్ఏ ప్రీమియర్స్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా ధమాకా అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా , ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ లీల ,  రవితేజ సరసన హీరోయిన్ గ నటిస్తోంది. బిమ్స్ ఈ మూవీకి సంగీతం అందించగా కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు.

ఇప్పటికే బీన్స్ సంగీతం అందించిన కొన్ని పాటలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.  ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యూఎస్ఏ ప్రీమియర్స్ కు సంబంధించిన అద్భుతమైన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ని ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీ సంస్థ వారు విడుదల చేయనున్నారు.
 

ఈ సంస్థ వారు ఈ సినిమాను 'యూఎస్ఏ '  లో ఈరోజు అనగా డిసెంబర్ 22 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ వేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడడంతో ఫుల్ జోష్ లో ఈ మూవీ ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ సంవత్సరం  ఖిలాడి ,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రవితేజ "ధమాకా" మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: