ఆ తేదీ నుండి ఫ్రీగా "రామ్ సేతు" మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్షయ్ కుమార్ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ తన కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అక్షయ్ కుమార్ ఇప్పటికే ఈ సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం రక్షా బంధన్ ,  పృథ్వీరాజ్ ,  రామ్ సేతు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో రామ్ సేతు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించినప్పటికీ , మిగతా రెండు మూవీ లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం అక్షయ్ కుమార్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందించిన రామ్ సేతు మూవీ దీపావళి సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించుకున్న ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొన్ని రోజుల నుండి రెంట్ ఫర్ వ్యూ పద్ధతిలో అందుబాటు లోకి తీసుకువచ్చింది. ఈ మూవీ కి రెంట్ ఫర్ వ్యూ పద్ధతి లో కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీ నుండి ఉచితంగా చూసే వెసులు బాటను కల్పిస్తున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనితో అమెజాన్ ప్రైమ్ యూజర్ లు డిసెంబర్ 23 వ తేదీ నుండి ఈ మూవీ ని ఫ్రీ గా చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: