గ్లోబల్ మీడియాకోసం వ్యూహాలు మారుస్తున్న అల్లు అర్జున్ !

Seetha Sailaja
‘పుష్ప’ విడుదల తరువాత ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఆలోచనలు అన్నీ పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా ఇమేజ్ బన్నీకి ఏర్పడటంతో  అతడితో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో భారీనిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ బన్నీ తన దృష్టిని మాత్రం పూర్తిగా ‘పుష్ప 2’ పైనే పెడుతున్నారు. దీనికి అనుగుణంగా ఈమూవీని సుమారు 4వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీసే విధంగా పక్కా ప్లాన్ సిద్ధమైంది. ఇది ఇలా ఉంటే ఈమూవీ పై హాలీవుడ్ లో కూడ ఆశక్తి పెంచడానికి ‘పుష్ప 2’ మూవీకి సంబంధించిన భారీ పబ్లిసిటీని హాలీవుడ్ లో కూడ చేసేవిధంగా ఇప్పటి నుంచే బన్నీ పిఆర్ టీమ్ ప్లాన్స్ పై ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఈమూవీని ఆస్కార్ నామినేషన్స్ వరకు రాజమౌళి తీసుకు వెళ్ళడంతో చరణ్ జూనియర్ లకు హాలీవుడ్ మీడియాలో మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే పద్ధతిని సుకుమార్ తో అనుసరింపచేసి ‘పుష్ప 2’ కు హాలీవుడ్ లో కూడ మ్యానియా పెరిగేవిధంగా పక్కా ప్లాన్స్ లో ‘పుష్ప’ టీమ్ ఉంది అన్న సంకేతాలు కూడ వస్తున్నాయి. అయితే వీరు అనుసరించే ఈ ప్లాన్స్ కు ‘పుష్ప’ మూవీకి రష్యాలో వచ్చిన స్పందన కొంతవరకు ప్రతిబంధకం అవుతుందా అన్న సందేహాలు కూడ ‘పుష్ప’ టీమ్ కు ఏర్పడ్డాయి అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ కు జపాన్ దేశంలో వచ్చిన స్పందనను ప్రాతిపదికగా తీసుకుని ‘పుష్ప’ మూవీని రష్యా భాషలో తద్యమా చేసి ఆమూవీకి భారీ పబ్లిసిటీతో ఈమధ్యనే రష్యాలో విడుదల చేసారు. ఈమూవీ ప్రమోషన్ కోసం సుకుమార్ అల్లు అర్జున్ రష్మిక లు ప్రత్యేకంగా రష్యా వెళ్ళి అక్కడ రష్యన్ ప్రజలకు ‘పుష్ప’ మూవీని పరిచయం చేస్తూ భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చి రష్యన్ మీడియా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు అన్నవార్తలు ఉన్నాయి.

అయితే ‘పుష్ప’ మూవీకానీ ఆమూవీలో పుష్పరాజ్ గా నటించిన అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కానీ రష్యా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆమూవీకి అత్యంత తక్కువ కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈమూవీ రష్యన్ భాష డబ్బింగ్ ప్రమోషన్ కోసం పుష్ప టీమ్ ఖర్చుపెట్టిన డబ్బులో కనీసం సగభాగం కూడ కలక్షన్స్ గా రాలేదు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. దీనితో ఐకాన్ ష్టార్ గా ఉన్న బన్నీ గ్లోబల్ స్టార్ గా మారాలని చేసిన మొదటి ప్రయత్నం పెద్దగా సక్సస్ కాలేదు అన్నవార్తలు కూడ ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: