ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్: "2012 యుగాంతం" రోజు అసలేమీ జరిగింది ?

VAMSI
టాలీవుడ్ లో సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రోజు మినిమం గ్యారంటీ హీరోగా దూసుకుపోతున్న యంగ్ హీరోలలో కార్తికేయ ఒకరు. కెరీర్ లో కష్టపడి హీరో స్థాయికి వచ్చిన కార్తికేయకు దర్శకుడు అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100 సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చి ఇండస్ట్రీలో ప్రముఖ దర్శక నిర్మాతలను తనవైపుకు తిప్పుకునేలా చేసింది. ఇందులో కథ దగ్గర నుండి పాటలు అన్నీ బాగా కుదిరి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ కార్తికేయకు బ్యాడ్ లక్ ఈ సినిమా తర్వాత ఆ స్థాయిలో తనకు హిట్ రాలేదు. అందుకే ఇప్పటికీ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను తీస్తూ వెళుతున్నాడు. 

అందులో భాగంగా మరో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో త్వరలో మన ముందుకు "బెదురులంక 2012" అన్న సినిమాతో రానున్నాడు. ఇందులో కార్తికేయకు జతగా డీజే టిల్లు లో హీరోయిన్ గా చేసిన నేహా శెట్టి నటించింది. క్లాక్స్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కించాడు. కాగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించడం మరో విశేషం అని చెప్పాలి. అయితే ఈ సినిమా పాయింట్ ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంది. 2012 వ సంవత్సరంలో యుగాంతం రోజున ఏమి జరిగింది అన్న విషయాన్ని కథాంశంగా తీసుకుని ప్రేక్షకులు ఉత్కంఠగా ఫీల్ అయ్యేలా చిత్రీకరించారని తెలుస్తోంది. అస్సలు... ఆ రోజు ఏమి జరిగింది ? ప్రజలు యుగాంతం జరుగుతుందని తెలిసిన ప్రజల ఫీలింగ్ ఏమిటి ? చిన్న శబ్దాలు అయినా ఏ విధంగా భయపడ్డారు ? అన్న కొన్ని సంఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించారట.

ఈ సంఘటనల మధ్యన ఒక మంచి ప్రేమకథను కార్తికేయ మరియు నేహా శెట్టిల మధ్య చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుని కార్తికేయ కెరీర్ లో మళ్ళీ హిట్ ను తీసుకువచ్చి హీరోగా నిలబడుతుందా చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: