వారిసు: మరికాసేపట్లో మూడో పాట ?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్  నటిస్తున్న తాజా ద్విభాషా చిత్రం 'వారీసు'.తెలుగు తమిళ భాషల్లో సినిమా తెరకెక్కుతుంది.తెలుగులో 'వారసుడు'గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా తొలి సారి రష్మిక మందన్నా నటిస్తుంది.దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి ఇంకా పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతి సందర్బంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.తెలుగు, తమిళ భాషల్లో  తెరకెక్కుతున్న 'వారసుడు'  మూవీ ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. కార్తీక్ పళని ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్లు రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ, సంగీత, క్రిష్, ఖుష్బూ లాంటి గొప్ప పేరున్న నటులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.


జనవరి 12 వ తేదీన తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్  చాలా బాగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను దీపావళి పండుగ సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేశారు. అలాగే రెండో సాంగ్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. రెండూ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని 'సోల్‌ ఆఫ్ వారసుడు'  సాంగ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రముఖ గాయని చిత్ర పాడిన ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టకుంటోంది. తెలుగు పాటల రచయిత రామజోగయ్య సాహిత్యం అందించిన ఈ పాట ఫుల్‌ లిరికల్‌ వీడియోను సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.ఈ మూవీ పై ప్రేక్షకులలో చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఇప్పటికే రిలీజైన 'రంజితమే', 'ది దళపతి' పాటలకు తెలుగు తమిళ ప్రేక్షకులు నుండి విశేష స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: