ఆ స్టార్ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ..!?

Anilkumar
తాజాగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ధమాకా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాడానికి సిద్ధంగా ఉంది. ఇక త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల మాస్ మహారాజా రవితేజ కి జోడిగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రవితేజ నటించిన ధమాకా సినిమా విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ధమాకా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా  నిర్వహించారు చిత్ర బృందం. 

అయితే ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ధమాకా సినిమా ఖచ్చితంగా బావుంటుంది... మా టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం ... డైరెక్టర్ నాగేంద్ర కెమెరామెన్ కార్తీక్ అద్భుతమైన వర్క్ ని ఈ సినిమాలో చూపించారు... అంతేకాదు శేఖర్, జానీ, యశ్వంత్ ఈ సినిమాలోని సాంగ్స్ ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు... ఇక రామ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ రియాక్షన్ ను అదరగొట్టేశారు... ప్రసన్న హ్యూమర్ నాకు చాలా ఇష్టం... ధమాకా అద్భుతంగా రాశాడు...ఈ సినిమాలో   నాకు ఇష్టమైన డైలాగ్ లు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు రవితేజ.. అంతే కాకుండా దర్శకుడు త్రినాధరావు ఇరగదీసేశాడు..

పాత సినిమాల్లో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య కాంబినేషన్లో ధమాకా సినిమాలో రావు రమేష్ ..ఆదిల కాంబినేషన్ చాలా సరదాగా ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల జనాల్లోకి బాగా వెళ్ళిపోతుంది.ఆమె అందంతోపాటు చాలా ప్రతి ఉంది. ఆమె నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లి పోతుంది. అంతేకాదు ఆమె తర్వాత నా సినిమాలకి డేట్స్ ఇస్తుందో లేదో  కూడా తెలీదు అన్నారు రవితేజ.. బీమ్స్ కూడా ధమాకా సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా పాజిటివ్ గా ఉంటారు.. అంతేకాదు ఈ సంస్థలో నేను సినిమాలు ఎప్పటికీ చేస్తూనే ఉంటాను... దీంతోపాటు అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను ఎక్కడ రాజీ పడకుండా తీశారు... ఆఖరిగా డిసెంబర్ 23న థియేటర్స్లలో కలుద్దాం అని ముగించాడు రవితేజ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: