మహేష్ తో నటించిన హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నమ్రత..!
తాజాగా నమ్రత , మహేష్ బాబు తో నటించిన హీరోయిన్ ల గురించి స్పందిస్తూ ... సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సోనాలి బింద్రే కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. అలాగే ఒక్కడు మూవీ లో భూమిక మరియు అతడు మూవీ లో త్రిష , మహేష్ బాబు కు బాగా సెట్ అయ్యారు అని నమ్రత చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ బాబు మరియు సమంత కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అని నమ్రత అభిప్రాయ పడింది. ఇక టైమింగ్ విషయం లో ఖలేజా మూవీ లో మహేష్ బాబు మరియు అనుష్క కు మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నచ్చుతాయి అని నమ్రత పేర్కొంది. ఇలా తాజాగా మహేష్ బాబు తో నటించిన హీరోయిన్ లపౌ నమ్రత స్పందించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.