ఇండస్ట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్రహ్మానందం...!!

murali krishna
సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఓ సినిమా వెండితెరపై ప్రదర్శించడానికి మేకర్స్ ఎంత కష్టపడతారో మనందరికి తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్ది చిత్ర బృందం వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. తాజాగా “చెడ్డీ గ్యాంగ్ తమాషా” సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు బ్రహ్మానందం.
బ్రహ్మానందం.. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్య నటుడు. దాదాపు 1200 చిత్రాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సైతం సాధించాడు. ఇక ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించిన బ్రహ్మానందం.. తనకు నచ్చిన సబ్జెక్ట్ ఉన్న మూవీల్లోనే నటిస్తున్నారు. తాజాగా “చెడ్డి గ్యాంగ్ తమాషా” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ హీరో కమ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. గాయంత్రి పటేల్ హీరోయిన్ గా నటించగా.. అబుజా, శ్రీలీల ఎంటర్టైన్ మెంట్స్ పై సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించారు. ఆదివారం జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడాలు లేవు. ఒక సినిమా కోసం మనమందరం ఎంత కష్టపడతామో మీకు తెలిసిందే. ఇక పెద్ద హీరో అయితే హిట్ అవుతుంది, చిన్న హీరో అయితే ఫ్లాఫ్ అవుతుంది అన్న మాటలు అసత్యాలు. ఏ సినిమా అయినా సరే కథ బాగుంటే అదే హిట్ అవుతుంది” అని బ్రహ్మానందం పేర్కొన్నారు.
ఇక హాస్య నటులు తీసే మూవీలన్నీ సూపర్ హిట్ కావాలని బ్రహ్మానందం అన్నారు. కామెడి ప్రపంచానికి తెలియాలి అని మా గురువుగారు జంధ్యాల చెప్పేవారని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు. కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్ని బతికించాలనే ఈ సినిమా వేడుకకు వచ్చానని బ్రహ్మానందం తెలిపారు. “నిర్మాతలు రైతుల లాంటి వారని, నష్టాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చేందుకే పనిచేస్తామని.. అన్నీ కుదిరితే ఈ సినిమా పార్ట్ 2లో బ్రహ్మానందం నటిస్తారని” నిర్మాత క్రాంతి కిరణ్ తెలపారు. అనంతరం ”చెడ్డీ గ్యాంగ్ తమాషా” ట్రైలర్ ను బ్రహ్మానందం విడుదల చేశారు. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం “రంగ మార్తాండ” నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: