కూతురిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన సింగర్ చిత్ర...!!

murali krishna
సింగర్ చిత్ర ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఏకంగా 25 వేల పాటలకు ప్రాణం పోసింది.
ఇలా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించడమే కాకుండా అరబిక్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ వట్టి ఇతర భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా నాలుగు దశాబ్దాల సినీ కెరియర్లో ఎంతోమంది సంగీత దిగ్గజల దగ్గర పాటలు ఆలపించిన చిత్రం తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిత్ర విజయ శంకర్ అనే ఒక ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు నందన అనే కుమార్తె జన్మించారు.అయితే ఈ చిన్నారి డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడేది.
ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో ఎదుగుదల అనేది ఉండదు.ఇలా తన కూతురిని ఎంతో ముద్దుగా చూసుకుంటున్నటువంటి చిత్ర 2011 వ సంవత్సరంలో తన కూతురితో కలిసి ఒక కచేరికి వెళ్ళింది అయితే అనుకోకుండా అక్కడ ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది.
కచేరిలో పాల్గొనడం కోసం చిత్రా వెల్లగా అక్కడ తన కుమార్తె నందన స్విమ్మింగ్ పూల్ లో పడి మరణించింది.ఇలా తన కుమార్తె మరణించడంతో నందనా పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఈమె ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నారు.ఇకపోతే డిసెంబర్ 18వ తేదీ నందన జయంతి కావడంతో తన కుమార్తెను గుర్తుచేసుకొని చిత్ర సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
స్వర్గ లోకంలో దేవకన్యలతో పుట్టినరోజు జరుపుకుంటున్న నీకు జన్మదిన శుభాకాంక్షలు.ఎన్నేళ్లు గడిచిన నీకు వయసు పెరగదు నా నుంచి దూరంగా ఉన్నా నువ్వు క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను.
నిన్ను చాలా మిస్ అవుతున్నా హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ నందన అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: