రామ్ చరణ్ మూవీ లో మరో స్టార్ హీరో...!!

murali krishna
మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.
ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకం గా తెర కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించి మెప్పించిన ఈయన ఇప్పుడు కొత్త సినిమా కొత్త సినిమా కోసం కష్టపడుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే ముందే ఈ సినిమా ను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న RC15 ఇప్పటికే సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకోగా ప్రెజెంట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కు జోడీ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా లో చరణ్ విభిన్నమైన లుక్స్ లో కనిపించి సినిమాకే హైలెట్ గా నిలుస్తాడట.
ఇందు లో ద్విపాత్రాభినయం చేస్తున్న చరణ్ గ్రామీణ యువకుడి గా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట.దీంతో ఈ సినిమా పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.ఈ సినిమా మరో హీరో కూడా నటించ బోతున్నాడట.
ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందట.
ఈ పాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటి స్తున్నాడని సమాచారం.ఈ సినిమాలోనే ఈ పాత్ర కీలకం అని అందుకే శంకర్ ఈ స్టార్ హీరోను ఈ పాత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బరువైన ఎమిషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ ను కూడా శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: