"మాచర్ల నియోజకవర్గం" మూవీకి "జీ5" లో సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి , నితిన్ సరసన హీరోయిన్ గా నటించగా , మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.

ఆ తర్వాత ఈ మూవీ జీ 5 "ఓ టి టి" ఎంట్రీ ఇచ్చింది.  ఈ మూవీ కి జీ5 "ఓ టి టి" లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జీ5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఈ మూవీ 75 మిలియన్ వ్యూస్ ను సాధించినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ జీ5 లో ఈ మూవీ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతునట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా నితిన్ ఒక మూవీ లో నటించబోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో భీష్మ మూవీ తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: