వైరల్ అవుతున్న జేమ్స్ కామెరూన్ ఇంటర్వ్యూ...!!

murali krishna
‘అవతార్ 2’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. చూసిన వారిలో చాలామంది.. విజువల్స్ కి ఫిదా అయిపోయారు. యాక్షన్ సీన్స్ కేక పుట్టించాయని మాట్లాడుకుంటున్నారు. ‘అవతార్’తో పోలిస్తే సీక్వెల్ కాస్త సాగదీసినట్లు అనిపించిందని కూడా పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ ఎంత? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు పక్కనబెడితే.. ‘అవతార్’ని హిందూ పురాణాల ఆధారంగా తీశారని తెగ మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లే డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మన మీడియాకు ఇచ్చిన ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘అవతార్’ ఈ పేరు వినగానే మనకు బాగా తెలిసిన పదంలా అనిపిస్తుంది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. దీన్ని సంస్కృతం నుంచే తీసుకున్నారు. ఈ టైటిల్ ని పాశ్చాత ప్రజలు సరిగా పలకలేరని స్వయంగా డైరెక్టర్ జేమ్స్ కామెరూనే ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీని తర్వాత ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేది సినిమాలో పాత్రల రంగు, వాటికున్న తోకలు. పూర్తి నీలంగా ఉండే ‘అవతార్స్’.. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. హిందు దేవుళ్లయిన రాముడు, కృష్ణుడు నీలం రంగులోనే ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్లే ‘అవతార్’లోని పాత్రలకు నీలం రంగు కావాలని పెట్టారా? పొరపాటున జరిగిందా అనే ప్రశ్న కామెరూన్ ని అడగ్గా.. నిజంగానే వాటి నుంచే స్పూర్తి పొందానని చెప్పాడు.
ఇక అవతార్ సినిమాలో ఈవా అనే చెట్టుతో పాటు నావి ప్రజలంతా కూడా ఓ పవిత్ర వృక్షం లోపల నివాసం ఉంటారు. చెట్లని పూజించడం, ఆరాధించడం అనే కాన్సెప్ట్ మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. దీని గురించి కూడా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ని అడగ్గా.. ‘హిందూ మతం నమ్మకాలు అంటే తనకు ఎంతో ఆసక్తి అని, అయితే ఈ సినిమాని మాత్రం ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించి తీయలేదు. ప్రజల మనసుల్ని తాకాలనే ఉద్దేశంతో తీశాను. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. అందుకే చాలామంది.. నా దగ్గరకి వచ్చి సినిమాలో తమని తాము చూసుకున్నామని చెప్పారు’ అని అన్నాడు.
ఇక తాజాగా రిలీజైన ‘అవతార్ 2’ సినిమాలోనూ మన పురాణాలని గుర్తుచేసేలా కొన్ని సీన్స్ కనిపించాయి. ప్రహ్లాదుడు-హిరణ్యకశపుడు టైపులో స్పైడర్- అతడి తండ్రి కల్నల్ మైల్స్ మధ్య చిన్న ట్రాక్ ఉంటుంది. ఇక హీరో జేక్ సల్లీ కుటుంబం సముద్రవాసుల దగ్గర తలదాచుకోవడం.. పాండవులు, అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో తలదాచుకున్న ఎపిసోడ్ ని గుర్తుచేస్తుంది. రామాయణంలో రాముడు వానరుల సాయంతో లంకపై గెలిచినట్లు ఇక్కడ హీరో జేక్ సల్లీ.. సముద్రవాసులతో కలిసి భూలోకవాసులపై గెలుస్తాడు. ఇదంతా చూస్తుంటే.. అవతార్ పాత్రలకు నీలిరంగు, తోకలు పెట్టడం అనే కాన్సెప్ట్ ని రామాయణం నుంచి డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పూర్తి పొందాడు. కాన్షియస్ గానో, సబ్ కాన్షియస్ గానో రామాయణ, మహాభారతాల ఇన్ ఫ్ల్యూయెన్స్ రెండో భాగంలోనూ చాలాచోట్ల కనిపించింది. మరి ‘అవతార్’ని హిందూ పురాణాలని బేస్ తీసుకుని తీశారనే అభిప్రాయం రైటా రాంగా? మీకు అనిపించింది కామెంట్స్ లో మాతో పంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: