సితార అన్ ప్లాన్డ్ బేబీ నమ్రత కామెంట్స్ !

Seetha Sailaja

మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటూ మహేష్ గురించి అదేవిధంగా తన పిల్లల గురించి అనేక ఆసక్తికర విషయాలను తమ అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. సూపర్ స్టార్ భార్యగా మాత్రమే కాకుండా మంచి బిజినెస్ ఉమెన్ గా నమ్రత రాణిస్తోంది.

లేటెస్ట్ గా హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన నమ్రత మహేష్ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు అతడి యాడ్స్ విషయాలను కూడ చాల నిశితంగా పట్టించుకుంటుంది అని ఆమె సన్నిహితులు చెపుతూ ఉంటారు. మిస్ ఇండియాగా ఎన్నిక అయి ఆతరువాత మోడలింగ్ ప్రోఫిషణ్ లోకి వచ్చి ఆపై సినిమాలలోకి వచ్చిన నమ్రత కు ప్రస్తుతం తన కుటుంబం తప్ప మరే విషయాలు పెద్దగా ఆశక్తి లేదు అని అంటోంది.

కొన్ని సినిమాలలో స్పెషల్ రోల్స్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నటన పై పూర్తిగా ఆశక్తి లేకపోవడంతో తాను ఆ అవకాశాలు అన్నీ వదులుకున్న విషయాలను ఒక ఇంటర్యూలో వివరించింది. ఇదే సందర్భంలో తన పిల్లల గురించి మాట్లాడుతూ గౌతమ్ ప్రిమెట్యూర్ బాబుగా పుట్టడంతో కొన్ని రోజుల పాటు తాను మహేష్ గౌతమ్ గురించి విపరీతంగా టెన్షన్ పడ్డామని ఆ టెన్షన్ తో తాము మరో బేబి వద్దు అనుకున్న ఆలోచనల మధ్య ‘అన్ ప్లాన్డ్ బేబి’ గా సితార పుట్టిన విషయాన్ని నమ్రత గుర్తు చేసుకుంది.

అయితే ప్రస్తుతం తనకు ప్రపంచం అంతా సితార మాత్రమే అనీ తన కూతురు లేకుండా ఒక్క క్షణం కూడ తాను ఉండలేను అంటూ సితార తో తన అనుబంధాన్ని బయటపెట్టింది. తనకు మహేష్ తో పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజు కూడ తాను మహేష్ తో గొడవ పడ్డ సందర్భాలు లేవని తన పిల్లలను అదేవిధంగా తనను విపరీతంగా ప్రేమించే మహేష్ లాంటి వ్యక్తి తనకు భర్తగా దొరకడం తన అదృష్టం అని అంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: