వీరసింహారెడ్డి స్టోరీ లీక్..ఆ సినిమాకు సీక్వెల్..

Satvika
తెలుగు హీరో బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి.. యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'వీరసింహారెడ్డి' సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటం తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా లో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటం తో ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు..

కాగా, ఈ సినిమా కు సంబందించిన ఓ సినిమా నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఈ సినిమా కు సంగీతం థమన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఈ సినిమా కు కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా, బీజీఎం కూడా నెక్ట్స్ లెవెల్‌ లో ఇచ్చాడట. ముఖ్యంగా బాలయ్య లాస్ట్ మూవీ 'అఖండ' బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సినిమా లో థమన్ ఇచ్చిన బీజీఎం తో ప్రేక్షకుల కు పూనకాలు వచ్చాయి. కొన్ని థియేటర్లు అయితే ఏకంగా సౌండ్ ఎక్కువగా ఉందని, చాలా తక్కువ సౌండ్‌తో సినిమాను ప్లే చేశారు.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. ఒకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ వీరసింహారెడ్డి , రెండవది అమెరికా నుంచి వచ్చే బాల సింహారెడ్డి . ఇవి తండ్రి కొడుకుల క్యారెక్టర్స్. గ్రామ రాజకీయాలలో వీరసింహారెడ్డి చనిపోతే బాల సింహారెడ్డి విలన్లపై పగ తీర్చుకుంటాడు. తన గ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి తన కలల్ని తీర్చుతాడు బాలసింహారెడ్డి. సాఫ్ట్ వేర్ నుంచి రాజకీయాల్లో కి వస్తే పిల్ల బచ్చాగాడు అని లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది స్టోరీ... స్టోరీ అదిరిపోయింది.. సినిమా కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: