చిరంజీవి సెట్ లో ప్రభాస్ మూవీ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసింది. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా , పూజా హెగ్డే ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడి గా నటించింది. సోను సూద్ విలన్ పాత్రలో నటించిన ,  ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒక ప్రత్యేక సెట్ లోనే నిర్వహించారు. ఈ మూవీ పరాజయం పాలైనప్పటికీ , ఆచార్య మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ కు మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇది ఇలా ఉంటే అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన ఈ ప్రత్యేక సెట్ లో ప్రభాస్ మూవీ కి సంబంధించిన షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ,  మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ ను మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన ఆచార్య మూవీ సెట్ లో కొంత భాగం తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రిధ్ధి కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా , సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: