తన అందం పై షాకింగ్ కామెంట్స్ చేసుకున్న దిల్ రాజ్ !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ వయసు 50 దాటిపోయినా ఇంకా చాల యంగ్ గా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురులో ఒకడుగా పేరుగాంచిన దిల్ రాజ్ నిర్మాత గా డిస్ట్రిబ్యూటర్ గా ఇప్పటికే అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. మృదుస్వభావిగా పేరుగాంచిన ఇతడు వ్యాపార వ్యవహారాలలో ఖచ్చితంగా ఉండటమే కాకుండా ఒక సినిమా కథ విన్న తరువాత ఆసినిమా జయాపజయాల పై ఖచ్చితమైన అంచనాలు కడతాడని అంటారు.

వచ్చే సంక్రాంతి రేస్ కు రాబోతున్న చిరంజీవి బాలకృష్ణల మూవీల మ్యానియాను లెక్కచేయకుండా దిల్ రాజ్ తన ‘వారసుడు’ డబ్బింగ్ మూవీని సంక్రాంతి రేస్ లో నిలబెట్టడమే కాకుండా ఆసినిమాకు ఎక్కువ ధియేటర్లు ఉండేలా దిల్ రాజ్ చక్రం తిప్పుతున్నాడు అంటూ విపరీతమైన విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈవిషయమై దిల్ రాజ్ స్పందిస్తూ తనకు రాజకీయాలు చేసే శక్తిలేదని అంటూ తన పై అందరు ఇలా విమర్శలు చేయడానికి తాను అందంగా ఉండటమే కారణం అయి ఉండవచ్చు అని కామెంట్ చేసినట్లు మాటలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో దిల్ రాజ్ ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలైంది. టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు అందగాడు అయినప్పటికీ తాను అందగాడిని అని ధైర్యంగా ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదనీ అలాంటిది దిల్ రాజ్ తాను అందగాడిని అని ఏవిధంగా భావిస్తున్నాడు అంటు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈవిషయమై ఇండస్ట్రీ వర్గాలు మరో విధంగా స్పందిస్తున్నాయి. దిల్ రాజ్ సమర్థవంతమైన నిర్మాత అయినప్పటికీ ఒకొక్కసారి దాపరికం లేకుండా తాను మనసులో ఏమనుకుంటే అలా మాట్లాడుతాడు అనీ అలాంటి వ్యవహారశైలి వల్లే దిల్ రాజ్ కు శతృవులు పెరుగుతున్నారు అంటు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీనితో సక్సస్ ఫుల్ నిర్మాత దిల్ రాజ్ లౌక్యం నేర్చుకోవాలి అంటూ మరికొందరు హితవు చెపుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: