పవన్ కోరుకుంటున్నది త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు మనసులో క్రిష్ !

Seetha Sailaja
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల సాన్నిహిత్యం మాటలకు అందనిది. ఈవిషయాన్ని స్వయంగా త్రివిక్రమ్ ఒక ఫిలిం ఫంక్షన్ లో చెప్పాడు. పవన్ ఏవిషయం పైన అయినా ఒప్పించాలి అన్నా అతడి డేట్స్ కావాలి అన్నా త్రివిక్రమ్ తో రాయబారం చేయిస్తే చాలు అన్ని పనులు అయిపోతాయి అని ఇండస్ట్రీ వర్గాలలో ఒక టాక్ ఉంది.

వీరిద్దరూ కలిస్తే చాలు రాజకీయాలతో పాటు సినిమాలు పుస్తకాలు సాహిత్యం పై గంటల తరబడి వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతుంటూ ఉంటాయని సన్నిహితులు చెపుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఆహా ‘అన్ ష్టాపబుల్’ సీజన్ 2 మ్యానియా పెంచడానికి అల్లు అరవింద్ త్రివిక్రమ్ ద్వారా పవన్ తో చేసిన రాయబారాలు సఫలం కావడంతో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ ష్టాపబుల్ షోలో బాలయ్య పవన్ ల ఇంటర్వ్యూ కోసం ఆహా ప్రేక్షకులు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ షోకు సంబంధించిన రిషూటింగ్ ఈనెల 27న షూట్ చేసి న్యూయిర్ సందర్భంగా డిసెంబర్ 31న ఆహా లో స్ట్రీమ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనితో బాలకృష్ణ పవన్ అభిమానులు ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పవన్ ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినా లేదంటే ఏదైనా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చినా త్రివిక్రమ్ తో జతగానే వెళతాడు.

దీనితో ఈ కార్యక్రమానికి కూడ పవన్ త్రివిక్రమ్ తో ఆహా షోకు వస్తాడు అన్న లీకులు వస్తున్నాయి. బాలయ్యా పవన్ లు ప్రస్తుతం రాజకీయాలలో చాల యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి రాజకీయాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలు సమాధానాలు ఈ షోలో ఉంటాయని అంచనాలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు సమాధానాలు కొంతవరకు త్రివిక్రమ్ ను ఇరుకున పెడతాయి కాబట్టి త్రివిక్రమ్ తెలివిగా తప్పుకుని ఈషోకు తనకు బదులు క్రిష్ ను పంపాలి అని చేస్తున్న ప్రయత్నాలకు ఎంతవరకు పవన్ అంగీకరిస్తాడు అన్న విషయం పై ఆశక్తి పెరిగిపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: