భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ పెళ్లి ఆరోజే..!

Divya
మంచు మనోజ్ హీరోగా ప్రస్తుతం సినిమాలు ఆపేసి దాదాపు 5 సంవత్సరాలకు పైగానే అవుతుంది. 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాలో నటించిన మంచు మనోజ్ ఆ తర్వాత అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా టైటిల్ ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది.  కానీ తర్వాత దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా కూడా పక్కకెళ్ళిపోయింది. అయితే పరిస్థితి ఇలా ఉంటే మంచు మనోజ్ మాత్రం 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకునే రెండు సంవత్సరాలకి వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది.
ప్రణతి రెడ్డి ప్రస్తుతం అమెరికా లో జాబ్ చేస్తోంది.  మరో పక్క దివంగత రాయలసీమ రాజకీయ పొలిటికల్ నేత దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక తో మంచు మనోజ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కూడా పలు సందర్భాలలో మీడియా కంట పడ్డారు దీంతో ఈ విషయం కాస్త హాట్ హ్యాపీగా మారింది ఇదిలా ఉండగా తాజాగా మంచు మనోజ్ కడప లోని పెద్ద దర్గాని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ   కొత్త సంవత్సరం కొత్త జీవితంలోకి అడుగుపెట్టి కొత్త సినిమాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 తేదీన మంచు మనోజ్ మరియు భూమా మౌనికల పెళ్లి జరగనున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం. మంచు మనోజ్ మాత్రం ప్రస్తుతం కుటుంబానికి దూరంగానే ఉంటున్నాడు. భూమా మౌనిక రెడ్డితో ప్రేమాయణం వల్లే ఆయన తన కుటుంబానికి దూరమయ్యాడు. అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మంచు మనోజ్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడు అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: